- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘ఉస్తాద్’ లో విలన్‌గా నటించనున్న స్టార్ డైరెక్టర్!

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్వకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ జనాల్లో భారీ అంచనాలను పెంచేసింది. అయితే ఇందులో హరీష్ శంకర్ విలన్ పాత్రలో డిపరెంట్‌గా చూపించబోతున్నారని తెలుస్తోంది. గబ్బర్ సింగ్ కోసం అభిమన్యు సింగ్‌ను తీసుకొచ్చిన ఈ దర్శకుడు ఉస్తాద్కోసం ఏకంగా ఓ తమిళ డైరెక్టర్ కమ్ యాక్టర్ ‘ఆర్ పార్తీబన్’ ను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
తెలుగులో ఈయన నటించిన సినిమాలు తక్కువే. అప్పట్లో రామ్ చరణ్ ‘రచ్చ’ సినిమాలో ఫ్లాష్ బ్యాక్‌లో చరణ్ తండ్రిగా నటించిన సూర్యనారాయణే ఈ పార్తీబన్. అలాగే కార్తీ, యుగానికొక్కడు సినిమాలో చోళరాజుగా కనిపించారు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్‌లో మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లిపోయే పాత్ర కాదని ఫుల్ లెంగ్త్ విలన్ రోల్‌లో నటిస్తాడని తెలుస్తోంది. కాగా డైరెక్టర్ ఈయన పాత్రను కొత్తగా డిజైన్ చేశారట.