Nagachaithanya: నాగచైతన్యకు అమ్మగా, ఫ్రెండ్‌గా, లవర్‌గా నటించిన ఏకైక హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే?

by Kavitha |
Nagachaithanya: నాగచైతన్యకు అమ్మగా, ఫ్రెండ్‌గా, లవర్‌గా నటించిన ఏకైక హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే?
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘జోష్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చైతూ.. ఆ తర్వాత ‘ఏమాయ చేశావే’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం హిట్స్, ప్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ‘తండేల్’ అనే మూవీ చేస్తున్నాడు చైతూ. మత్స్యకారుల జీవన నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా గతంలో చందు, చైతూ కాంబినేషన్‌లో ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే చైతన్యతో ఒకే ఒక్క హీరోయిన్ తల్లిగా, ఫ్రెండ్‌గా, హీరోయిన్‌గా నటించిందనే వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటే మెగా కోడలు లావణ్య త్రిపాఠి. ఈ బ్యూటీ కింగ్ నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ మూవీలో ఆయనకు భార్యగా నటించింది. ఆ తర్వాత ఆ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘బంగార్రాజు’లో నాగ్ కొడుకుగా నాగ చైత్యన నటించాడు. అలాగే ‘మనం’లో వీరిద్దరూ స్నేహితులుగా నటించడం జరిగింది. ‘మనం’లో ఆమె చిన్న పాత్రలో కనిపిస్తుంది. అలాగే ఈ ఇద్దరు హీరో హీరోయిన్స్‌గా ‘యుద్ధం శరణం’ అనే మూవీలో చేశారు. ఇలా నాగ చైతన్యతో లావణ్య త్రిపాఠి అమ్మగా, ఫ్రెండ్‌గా, లవర్‌గా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed