గూస్ బంప్స్ తెప్పిస్తున్న 'Ravanasura' థీమ్ సాంగ్!

by Hajipasha |   ( Updated:2023-02-07 12:22:34.0  )
గూస్ బంప్స్ తెప్పిస్తున్న Ravanasura థీమ్ సాంగ్!
X

దిశ, సినిమా: మాస్ హీరో రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మల కాంబోలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'రావణాసుర'. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్‌వర్క్స్‌ బ్యానర్‌లో అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ నుంచి తాజాగా థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. 'దశకంఠ లంకాపతి రావణా' అంటూ సాగే ఈ గీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి హైలీ ఎనర్జిటిక్‌గా కంపోజ్ చేయగా 'రావణ' అనే చాంట్‌తో మొదలైన ట్రాక్ వైబ్రెంట్‌గా అనిపిస్తోంది. శాంతి పీపుల్, నోలిక్ ఆలపించిన పాట చరణంలో వినిపించిన 'శివతాండవం' గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇక ఇప్పటికే గ్లింప్స్‌‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. శ్రీకాంత్ విస్సా సరికొత్త కథ అందించిన మూవీలో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తుండగా అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 7న థియేటర్స్‌లో విడుదల కానుంది.

Advertisement

Next Story