Kalki: చిన్నపిల్లలకు గోల్డెన్ చాన్స్ ఇచ్చిన టీమ్.. పోస్ట్ వైరల్

by Hamsa |
Kalki: చిన్నపిల్లలకు గోల్డెన్ చాన్స్ ఇచ్చిన టీమ్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ‘కల్కి2898ఏడి’. ఇందులో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, దిశా పటాని, శోభన వంటి నటీనటులు కీలక పాత్రలో నటించారు. దీనిని డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్‌గా తెరకెక్కించగా.. ఈ చిత్రం జూన్ 27న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది.

ఈ క్రమంలో.. తాజాగా, కల్కి మేకర్స్ చిన్నారులకు అదిరిపోయే అవకాశాన్ని ఇచ్చారు. చిన్న పిల్లలు కల్కి మూవీ కోసం వేసిన సెట్‌ను చూసే గోల్డెన్ చాన్స్ ఇస్తూ ఇన్‌స్టా వేదికగా వైజయంతీ మూవీ మేకర్స్ పోస్ట్ పెట్టారు. దాని కోసం మీ చిన్నారికి సంబంధించిన ఓ వీడియోను పంపితే అందులో కొంత మందిని ఎంపిక చేసి సెట్ చూసే చాన్స్ ఇస్తామని తెలిపారు. ఇక అది చూసిన వారు నేను మేజర్ సార్ అయినా నాకు ఒక చాన్స్ ఇవ్వండి అని కామెంట్లు పెడుతున్నారు.

(Video Link Credits To vyjayanthi movies Instagram Channel)

Advertisement

Next Story