- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 30 కోట్లు లాస్ .. మూడేళ్ల కష్టం వృధా.. పట్టించుకోని ఎన్టీఆర్
దిశ, సినిమా : ‘ఉరి’ సక్సెస్ తర్వాత డైరెక్టర్ ఆదిత్య ధర్ సూపర్ హీరో ఫిల్మ్ ‘ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ’ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. రోనీ స్క్రూవాలా నిర్మాతగా విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ లీడ్ యాక్టర్స్‌గా ప్రకటించారు. ఆ తర్వాత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’తో అమేజింగ్ అప్లాజ్ అందుకున్న సమంతతో సారాను రీప్లేస్ చేశారు. అయితే కొవిడ్ కారణంగా సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో సదరు ప్రొడ్యూసర్ ఈ ప్రాజెక్ట్ చేయనని చెప్పాడు. దీంతో దర్శకుడు జీయో స్టూడియోస్‌ను అప్రోచ్ కావడంతో మూవీ నిర్మాణానికి ఓకే చెప్పింది. కానీ రూ. 350-500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాకు విక్కీ కరెక్ట్ కాదని.. అతన్ని ప్రాజెక్ట్ నుంచి తొలగించి స్టార్స్‌ను ఎంచుకోవాలని నిర్మాతలు సూచించారు. దీంతో పాన్ ఇండియా హీరోలుగా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్, యశ్‌లను అప్రోచ్ అయ్యాడు డైరెక్టర్. కానీ ఈ స్క్రిప్ట్‌పై ఇంట్రెస్ట్ చూపని యాక్టర్స్.. తాము ఇప్పుడు చేయాలనుకున్న జోనర్ ఇది కాదని నో చెప్పేశారు.
దీంతో డైరెక్టర్ రణ్‌వీర్ సింగ్‌ను అప్రోచ్ కాగా శక్తిమాన్ టైప్‌లో ఉన్న అశ్వద్ధామ క్యారెక్టర్ చేసేందుకు ముందుగా ఎగ్జయిటింగ్‌గా ఓకే చెప్పాడు. అయితే స్క్రీన్‌ప్లే డెవలప్‌మెంట్ సరిగ్గా లేకపోవడంతో.. అటు ఎస్, ఇటు నో చెప్పలేక ఉండిపోయాడు. దీంతో ప్రాజెక్ట్ సక్సెస్‌పై నమ్మకంలేని జీయో స్టూడియోస్ మొత్తానికి ఇప్పటికైతే సినిమాను పక్కన పెట్టేయాలని నిర్ణయించుకుంది. అయితే ఇంత మందిని అప్రోచ్ కావడం, ప్రీప్రొడక్షన్ వర్క్‌కు ఇప్పటికే రూ.30 కోట్లు ఖర్చు అయ్యాయి. కానీ రూ. 500 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసి నష్టపోయే బదులు ఈ చిన్నమొత్తం నష్టపోతేనే బెటర్ అని మేకర్స్ నిర్ణయించుకున్నారని బాలీవుడ్ సమాచారం.
Read more :