గ్రాండ్‌గా లాంచ్ అయిన 'ASR' నిర్మాణ సంస్థ.. లోగో విడుదల

by Vinod kumar |
గ్రాండ్‌గా లాంచ్ అయిన ASR నిర్మాణ సంస్థ.. లోగో విడుదల
X

దిశ, సినిమా: సినిమా మీద మక్కువతో నూతనంగా స్థాపించిన ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ‘ASR’ (Amezing Screen Reels) అనే పేరుతో సినీ రంగంలోకి అడుగుపెడుతున్నాడు ప్రముఖ వ్యాపారవేత్త బి.శ్రీ రంగం శ్రీనివాస్(GSR). ఈ సందర్బంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయగా సముద్ర, శోభారాణి, లగడపాటి శ్రీనివాస్, అర్జున్, బి.సత్యనారాయణ, పి. విజయ్ కుమార్ తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొని 'ASR' లోగోను విడుదల చేశారు.

ఈ మేరకు మాట్లాడిన సముద్ర.. ‘తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ప్రొడక్షన్ సంస్థలు మంచి సినిమాలు నిర్మించి గొప్ప పేరు తెచ్చుకున్నాయని, వాటిలాగే ASR కూడా గొప్ప సంస్థగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అన్నాడు. చివరగా మాట్లాడిన శోభారాణి, శ్రీరంగం శ్రీనివాస్, అజయ్, శాంతయ్యలు ‘ASR’ పేరు అద్భుతంగా ఉంది. టాలెంట్ ఉన్నవారికి సపోర్ట్‌గా నిలవడానికి ఈ సంస్థ ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఉన్నతమైన చిత్రాలతో అనతికాంలోనే పెద్ద సంస్థగా ఎదగాలని కోరుతున్నాం’ అన్నారు.

Advertisement

Next Story