ఇండస్ట్రీలో విడిపోతున్న మరో జంట.. ? డిటెయిల్స్..

by Hamsa |
ఇండస్ట్రీలో విడిపోతున్న మరో జంట.. ? డిటెయిల్స్..
X

దిశ, సినిమా : బిగ్ బాస్ హౌజ్‌లో ప్రేమలో పడిన కరణ్ కుంద్రా-తేజస్వీ ప్రకాశ్.. బయటకు వచ్చాక విడిపోతారనుకున్నారు. కానీ, అంతకు మించిన బాండింగ్‌తో దగ్గరయ్యారు. ఒకరినొకరు పిక్ చేసుకోవడం, వెకేషన్స్‌కు వెళ్లడం, స్పెషల్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం, కలిసి ఫొటోషూట్స్ చేయడం వంటివి వీరిద్దరు మేడ్‌ఫర్ ఈచ్ అదర్ అనేలా చేశాయి. ఈ జోడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ పెరిగేందుకు కారణమైంది.

ఈ క్రమంలో గతంలో త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ రాగా కొన్ని రోజులుగా విడిపోతున్నారనే న్యూస్ ప్రచారమవుతోంది. ఇద్దరు ఈ మధ్య కలవకపోవడం, కెమెరాకంట పడకపోవడం ఇందుకు బలాన్నిచ్చాయి. అయితే వీటన్నింటికి ఎండ్ కార్డ్ వేస్తూ.. న్యూ పోస్ట్‌లో ‘ఐ లవ్ యూ కరణ్’ అని చెప్పుకొచ్చింది తేజస్వి. దీంతో ప్రస్తుతం ఈ ఇద్దరి ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

Advertisement

Next Story