తన తాత NTR అంటే తారకరత్నకు ఎంత ప్రేమో.. అందుకే అలా చేశాడంట..!

by Javid Pasha |   ( Updated:2023-02-20 13:24:47.0  )
తన తాత NTR అంటే తారకరత్నకు ఎంత ప్రేమో.. అందుకే అలా చేశాడంట..!
X

దిశ, వెబ్ డెస్క్: గుండెపోటుకు గురై 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన నందమూరి తారకరత్న ఈ నెల 18న తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. తారకరత్న చనిపోయాక ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. తన తాత ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో తారకరత్న చెప్పాడు. అయితే తాతపై తన ఇష్టాన్ని నిరూపించుకునేందుకు తారకరత్న వినూత్నంగా ఆలోచించాడు. అందుకోసం ఆయన తన సంతానాన్ని వాడుకున్నాడు.

తారకరత్న అలేఖ్యరెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం వారికి ముగ్గురు సంతానం కలిగారు. పెద్ద కూతురుకు నిష్క (Nishka) అని పేరు పెట్టారు. తర్వాత ఓ పాప, బాబు కవలలుగా పుట్టారు. వారికి తాన్యారామ్ (Tanyaram), రేయా (Reya) అని పేరు పెట్టారు. ఈ ముగ్గురి ఇంగ్లీష్ పేర్లలోని మొదటి అక్షరాలను కలిపితే ఎన్టీఆర్ అనే పేరు వస్తుంది. నిష్కలోని మొదటి అక్షరం N, తాన్యారామ్ లోని T, అలాగే రేయాలోని R కలిపితే NTR అనే పేరు వస్తుంది. ఇలా తాత మీద ఉన్న ప్రేమతో తన పిల్లలకు ఎన్టీఆర్ అనే పేరు వచ్చేలా పేర్లు పెట్టాడు తారకరత్న.

ఇవి కూడా చదవండి : నా భద్రాద్రి రాముడు ఇక లేరు : ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కంటతడి

Advertisement

Next Story