Dhalapathi Vijay సినిమా డిజాస్టరని ముందే తెలుసు.. Tamannaah Bhatia షాకింగ్ కామెంట్స్

by sudharani |   ( Updated:2023-08-01 04:31:09.0  )
Dhalapathi Vijay సినిమా డిజాస్టరని ముందే తెలుసు.. Tamannaah Bhatia షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మిల్కీ బ్యూటీ తమన్నా.. ప్రస్తుతం తెలుగు తమిళ్, హిందీ భాషల్లో పలు వెబ్ సిరీస్‌లు చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవల వచ్చిన ‘లస్ట్ స్టోరీస్-2’ లో అలరించిన అమ్మడు.. బోల్డ్ సన్నివేశాల్లో నటించి రచ్చ చేసింది. ఇక ప్రస్తుతం తమన్న చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్‌లో సూపర్ స్టార్ రజనీ కాంత్ మూవీ ‘జైలర్’ ఒకటి. ఇందులో తమన్న ఐటెమ్ సాంగ్‌లో మెరిసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేయడంతో.. ఆ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్న తన కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన సినిమా గురించి చెప్పుకొచ్చింది. కెరీర్ బిగినింగ్‌లో ఉన్నప్పుడు తమన్నా చాలా సినిమాల్లో చేసింది. ఇందులో దళపతి విజయ్ హీరోగా నటించిన ‘సుర’ మూవీ ఒకటి. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలో తన పాత నచ్చలేదని, సినిమా షూటింగ్‌లోనే ఇది డిజాస్టర్‌గా నిలుస్తుందని తెలుసు. కానీ, కమిట్ అయిన తర్వాత పూర్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉంటుందని తెలిపింది. మూవీ చేయడం వరకే తమ చేతిలో ఉంటుందని.. హిట్ లేక ఫట్టా అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుందని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : దర్శకుడితో జ్యోతి రాయ్ రెండో పెళ్లి.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!

Advertisement

Next Story