యువరాజును కనుగొనే ముందు చాలా కప్పలను ముద్దు పెట్టుకున్నానంటూ తాప్సీ షాకింగ్ కామెంట్స్!

by Hamsa |
యువరాజును కనుగొనే ముందు చాలా కప్పలను ముద్దు పెట్టుకున్నానంటూ తాప్సీ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ తాప్సీ ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకుంది. కానీ ఇక్కడ పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ విభిన్న పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతుంది. అయితే తాప్సీ ఇటీవల డుంకీ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఆమె పర్సనల్ విషయానికి వస్తే.. తాప్సీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోయ్‌ను ప్రేమిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మార్చి 23న ఉదయ్‌పూర్‌లో పెళ్లి కూడా చేసుకుంది. దీనిపై ఎలాంటి ప్రకటన, పోస్ట్ వంటివి చేయలేదు.

కానీ సోషల్ మీడియాలో మాత్రం తాప్సీ, సంగీత్, పెళ్లికి సంబంధించిన వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ ఒకానొక సందర్భంలో కప్పలను ముద్దు పెట్టుకున్నట్టు తెలిపి షాకిచ్చింది. ‘‘నేను యువరాజును కనుగొనే ముందు చాలా కప్పలను ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది. నేను పరిపక్వత చెందిన తర్వాత, నాకు కావాల్సింది అబ్బాయి కాదు, మనిషి అని అర్థం అయింది. ఇందులో చాలా తేడా ఉంది. అర్థం చేసుకునే వ్యక్తి మాత్రమే సంబంధంలో నేను కోరుకున్న భద్రత, స్థిరత్వాన్ని అందించగలరని నిశ్చయించుకున్నాను.

అప్పుడే డిసైడ్ అయ్యా నాతో వేగాలంటే అబ్బాయి కాదు.. మగాడు అయ్యి ఉండాలని. ఊరికే ఎమోషనల్ అయిపోయి, ఏడ్చేవాళ్ళు లేదా బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు నాకు నచ్చరు. అలాంటి వాళ్ళు ఉంటే నాపై, నా కుటుంబంపై వారి ఎఫెక్ట్ పడుతుంది. ఆ ప్రభావం నా పనిపై కూడా పడుతుంది. అందుకే నా జీవితానికి సంబంధించిన విషయాలపై నేనే నిర్ణయం తీసుకుంటా’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా ఈ విషయం తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు.


Next Story

Most Viewed