Viral video: ఇతడి డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. ఈ బొమ్మ గీసేందుకు 1,105 కిలోమీటర్లు పరిగెత్తాడా?

by D.Reddy |
Viral video: ఇతడి డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. ఈ బొమ్మ గీసేందుకు 1,105 కిలోమీటర్లు పరిగెత్తాడా?
X

దిశ, వెబ్ డెస్క్: గూగుల్ మ్యాప్స్ (Google Maps) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎప్పుడైనా తెలియని ప్రాంతాలకు వెళ్లినప్పుడు మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఇందులో ఎన్నో అద్భుతమైన ఫీచర్లను కూడా మనకు అందిస్తుంది. ఇందులో భాగంగానే మనం ఫోన్‌లో లోకేషన్ ఆన్ చేసుకుని ఎక్కడ తిరిగినా GPS ట్రాకింగ్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. తాజాగా ఓ వ్యక్తి ఈ GPS ట్రాకింగ్‌ ఉపయోగించి మ్యాప్స్‌లో అద్భుతమైన బొమ్మ గీశాడు. అదేలాగో తెలుసుకోవాలంటే ఈ వార్తను పూర్తిగా చదివేయండి మరీ.

కెనడాలోని (Canada) టొరంటోకు (Toronto) చెందిన ఓ వ్యక్తి టెక్నాలజీ, ఫిట్‌నెస్, కళలు.. మూడింటి సాయంతో నెట్టింట్లో ఓ స్పెషల్ వీడియోను క్రియేట్ చేశాడు. సదరు వ్యక్తి ఒక ఏడాది పాటు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని 1,105 కిలోమీటర్లు పరిగెత్తి, మ్యాప్‌లో GPS ట్రాకింగ్ ద్వారా డ్యానింగ్ బొమ్మను సృష్టించాడు. దీనిని నెట్టింట షేర్ చేయగా, ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'ఇతడు ఈ బొమ్మ కోసం ఏడాది మొత్తం పరిగెత్తాడు, కానీ నేను ఫ్రిజ్‌ వరకు నడవడానికి కూడా కష్టపడుతున్నాను.. హాట్సాఫ్' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, 'అతడి డెడికేషన్, క్రియేటివిటీ సూపర్' అంటూ మరో యూజర్ కామెంట్ పెట్టాడు.

అయితే, కొంత మంది దీనిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ఫేక్ వీడియో అని, ఎడిట్ చేశారని కొట్టిపారేస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటి వరకు 12.7 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.



Next Story

Most Viewed