కమల్ హాసన్ ఔట్.. బిగ్ బాస్ హోస్ట్‌గా మరో స్టార్ హీరో

by Disha News Desk |
కమల్ హాసన్ ఔట్.. బిగ్ బాస్ హోస్ట్‌గా మరో స్టార్ హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: విశ్వనటుడు కమల్‌హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమల్ నటనకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కేవలం వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా కమల్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తమిళ బిగ్ బాస్ షోతో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌లో కొన్ని ఎపిసోడ్‌లు పూర్తయిన తర్వాత తాను తప్పుకుంటున్నట్లు కమల్ ప్రకటించాడు. వ్యక్తిగత కారణాల వల్లే షో నుంచి తప్పుకుంటున్నానని కమల్ తెలిపాడు. దీంతో ఇప్పుడు కమల్ ప్లేసులో ఎవరు వస్తారని తమిళ ప్రేక్షకులు జుట్టు పీక్కుంటున్నారు.

ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చేసింది. విశ్వనటుడి ప్లేసులో తమిళ మన్మథుడు శింబు బిగ్‌బాస్ షోను హోస్ట్ చేయనున్నాడు. ఈ విషయాన్ని డిస్నీ+ హాట్‌స్టార్ తమిళ్ తన ట్వీటర్ ఖాతా ద్వారా ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో శింబు గ్లామరస్‌గా కనిపిస్తున్నాడు. మరి బిగ్‌బాస్ షోతో శింబు ఏమాత్రం ఆకట్టుకుంటాడో చూడాలి.


Advertisement

Next Story