కల్కిపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్.. వైరల్ అవుతున్న పోస్ట్

by Sujitha Rachapalli |
కల్కిపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్.. వైరల్ అవుతున్న  పోస్ట్
X

దిశ , సినిమా: దేశ వ్యాప్తంగా ' కల్కి 2898 AD' మూవీ మానియా కొనసాగుతోంది. ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా హాలీవుడ్ రేంజులో ఉందనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ రీచ్ అయిందని మురిసిపోతున్నారు సినీ లవర్స్. ఎక్కడ చూసినా పాజిటివ్ టాక్ వినిపిస్తుండటంతో పండగ చేసుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇక ఇప్పటికే సెలబ్రిటీలు సినిమాను చూసి ఎంజాయ్ చేస్తుండగా.. దర్శక ధీరుడు రాజమౌళి తన ఒపీనియన్ చెప్తూ స్పెషల్ పోస్ట్ పెట్టాడు.

' కల్కి కాన్సెప్ట్ బిల్డ్ చేసే తీరు అదిరిపోయింది. ఇన్ క్రెడిబుల్ సెట్టింగ్స్ నన్ను బౌల్డ్ చేశాయి. డార్లింగ్ తన టైమింగ్, ఈజ్ తో చంపేశాడు. అమితాబ్ జీ, కమల్ సార్, దీపిక నుంచి గ్రేట్ సపోర్ట్ లభించింది. చివరి 30 నిమిషాలు పూర్తిగా మరో లోకంలోకి వెళ్ళిపోయా. ఇంత చక్కగా ఎగ్జిక్యూట్ చేసిన నాగి, వైజయంతీ బ్యానర్ అండ్ టీమ్ కు ఖుడోస్' అని పోస్ట్ పెట్టాడు. కాగా జక్కన్న రివ్యూ ఇంటర్నెట్ లో వైరల్ కాగా సినిమాకు మంచి పుష్ ఇచ్చినట్లు అయింది అంటున్నారు నెటిజన్లు.

Next Story