SS Rajamouli : రాజమౌళికి షాకిచ్చిన జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్.. అసలేం జరిగింది!

by Javid Pasha |   ( Updated:2023-06-29 06:42:15.0  )
SS Rajamouli : రాజమౌళికి షాకిచ్చిన జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్.. అసలేం జరిగింది!
X

దిశ, వెబ్ డెస్క్: బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో గ్లోబల్ డైరెక్టర్ గా మారాడు జక్కన్న. ఇక ఆయన డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ ఏకంగా ఆస్కార్ అవార్డును సాధించి భారతీయుల సత్తాను ప్రపంచానికి చాటింది. అయితే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి ఆస్కార్ అకాడమీ బిగ్ షాక్ ఇచ్చింది. ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యుల జాబితాను అకాడమీ విడుదల చేసింది. అందులో భారత్ నుంచి చాలా మందికి చోటు లభించింది. ప్రొడక్షన్ డిజైన్ బ్రాంచ్‌లో సాబు సిరిల్, డైరెక్టర్స్ కేటాగిరిలో మణిరత్నం, చైతన్య తమ్హానే, డాక్యుమెంటరీ విభాగంలో షౌనక్ సేన్ ను అకాడమీ ఆహ్వానించింది.

ఇక నిర్మాతల విభాగంలో సిద్ధార్థ్ రాయ్ కపూర్, కరణ్ జోహార్ లకు చోటు దక్కగా.. వీఎఫ్ఎక్స్ కేటాగిరీలో హరేష్ హింగోరాణి, పి.సి.సనత్ , ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీ విభాగంలో క్రాంతి శర్మ, సినిమాటోగ్రఫీలో సెంథిల్ కుమార్ అకాడమీలో స్థానం సంపాదించుకున్నారు. అదేవిధంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో తమ సత్తా చాటిన యాక్టర్స్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ యాక్టర్స్ విభాగంలో చోటు దక్కించుకోగా.. మ్యూజిక్ విభాగంలో ఎంఎం కీరవాణి, చంద్రబోస్ అకాడమీలో స్థానం సంపాదించుకున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీని అన్ని తానై తెరకెక్కించిన డైరెక్టర్ రాజమౌళికి మాత్రం ఇందులో చోటు దక్కలేదు.

Read More: అల్లు అర్జున్ తీసుకున్న కట్నంపై క్లారిటీ ఇచ్చిన స్నేహ రెడ్డి తండ్రి?

Advertisement

Next Story