SRIREDDY: నెటిజన్లను కలవరపెడుతోన్న శ్రీరెడ్డి సూసైడ్ నోట్.. చివరికి చనిపోతుందా?

by Anjali |
SRIREDDY: నెటిజన్లను కలవరపెడుతోన్న శ్రీరెడ్డి సూసైడ్ నోట్.. చివరికి చనిపోతుందా?
X

దిశ, సినిమా: తరచూ ప్రముఖ సెలబ్రిటీలపై, రాజకీయ నాయకులపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలుస్తుంటుంది హాట్ బ్యూటీ శ్రీరెడ్డి. ఈమె మొదట్లో పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ పాత్రల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. తర్వాత అవకాశాలు రాకపోవడంతో దర్శక, నిర్మాతలపైనే విమర్శలు గుప్పించింది. ఈ భామ సోషల్ మీడియా సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. సంబంధం లేని విషయాల్లో కూడా తలదూర్చి తరచూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. గతంలో మానసికంగా, శారీరకంగా ఎంతో మంది తనను వేధిస్తున్నారని, కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇకపోతే శ్రీరెడ్డి ఎన్నికల ముందు నుంచే వైసీపీ పార్టీ అధినేత జగన్‌కు సపోర్ట్‌గా మాట్లాడుతోన్న విషయం తెలిసిందే.

ఎన్నికల అనంతరం పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు విజయం సాధించడంతో ఈమె వారిపై తరచూ విమర్శలు గుప్పిస్తూనే ఉంటుంది. ఇటీవల వీరిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఎన్డీయే కూటమి అధికారంలో ఉందని, తనను ఏమైనా చేస్తారేమో అనే భయంతో శ్రీరెడ్డి నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌లో ‘‘నేను చాలా మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యాను. నన్ను ఇక ఆ భద్రకాళి అమ్మవారే కాపాడాలి. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో నాకు సూసైడ్ చేసుకునే ఆలోచనలు వస్తున్నాయి. ఒకవేళ నేను ఆత్మహత్యకు పాల్పడితే దానికి కారణం మీడియా అండ్ టీడీపీ, జనసేన పార్టీలే. నేను ఎన్ని డేస్ బతుకుతానో కూడా నాకు తెలియట్లేదు.

నేను ఇప్పుడు చెప్పే మాటలు ఎవ్వరూ నమ్మరు. సిల్లీ కామెంట్స్ అనుకుంటారు. కానీ నాకు నిజంగా చనిపోవాలని ఉంది. ’’. అంటూ శ్రీరెడ్డి పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీంతో నెటిజన్లు ‘నోరు అదుపులో పెట్టుకుంటే సరిపోద్ది చనిపోవడం ఎందుకు? నువ్వే కాదు చాలా మంది ఎవరో చెప్పారని ఇతర పార్టీ వారిని విమర్శించారు. మరికొంతమంది ఏమో శ్రీరెడ్డి జస్ట్ బెదిరించడానికి మాత్రమే ఆ పోస్ట్ పెట్టింది.. మాకు జెన్యూస్ గా అనిపించడం లేదు, మరీ చివరకు చనిపోతావా ఏంటి? ఆ ఆలోచనలు ఏం పెట్టుకోకు నిన్ను ఎవరూ ఏం చేస్తారు శ్రీరెడ్డి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story