నిర్మాతలను భయపెడుతున్న శ్రీలీల.. డేట్స్‌తో ఇబ్బందులే..

by Aamani |   ( Updated:2023-05-07 14:33:52.0  )
నిర్మాతలను భయపెడుతున్న శ్రీలీల.. డేట్స్‌తో ఇబ్బందులే..
X

దిశ, సినిమా: రాఘవేంద్ర రావు దర్శకత్వలో ‘పెళ్లి సందD’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ శ్రీలీల. మొదటి సినిమాతో మంచి పాపులారిటీ దక్కించుకున్న బ్యూటీ.. తెలుగులో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నిర్మాతలకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో అర డజను సినిమాలు ఉండగా.. వీటిలో విజయ్ దేవరకొండ హీరోగా ‘VD 12’, మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో #SSMB 28, పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్‌ల ‘ఉస్తాద్ భగత్ సింగ్’, రామ్ పోతినేని – బోయపాటి సినిమాలు ఉండగా.. వీటితో పాటుగా అనిల్ రావిపూడి చిత్రంలో బాలకృష్ణ కుమార్తెగా కూడా నటిస్తోంది. అయితే పని భారం వల్ల డేట్స్ లభ్యత శ్రీలీలకు సవాలుగా మారింది. ఒప్పుకున్న చిత్రాలు కచ్చితంగా చేయక తప్పదు కనుక ఒకేసారి ఇన్ని చిత్రాలు ఎలా లీడ్ చేస్తుందోనని నిర్మాతలు కంగారు పడుతున్నట్లు సమాచారం.

Also Read..

నయనతారపై షారుఖ్ కామెంట్స్ వైరల్

Advertisement

Next Story