Pawan Kalyan మూవీలో హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ Sree Leela !

by Hamsa |   ( Updated:2023-01-05 07:52:04.0  )
Pawan Kalyan మూవీలో హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ Sree Leela !
X

దిశ, సినిమా: రాజకీయల్లో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలతో కూడా అంతే బిజీగా ఉన్నాడు. తాజాగా 'సాహో' చిత్ర దర్శకుడు సుజీత్‌ దర్శకత్వంలో పవన్‌ ఒక సినిమా తీయబోతున్నట్లు అధికారికంగా కన్ఫర్మ్‌ అయింది. దానయ్య ఈ మూవీని నిర్మించబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. అయితే అతి త్వరలోనే 'హరి హర వీరమల్లు' సినిమా చిత్రీకరణ పూర్తికాగానే హరీష్ శంకర్ మూవీని ముగించబోతున్న పవన్.. ఇదే ఏడాదిలో సుజీత్‌ దర్శకత్వంలో సినిమాను కూడా పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నాడంట. ఇకపోతే 'పెళ్లి సందడి' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీ లీలా.. నక్క తోక తొక్కినట్లుంది. వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. రీసెంట్‌గా 'ధమాకా'తో సూపర్ హిట్‌ అందుకొగా ఇందులో సీనియర్ హీరో రవితేజకు బాగా సెట్‌ అయింది. దీంతో శ్రీలీలను పవన్‌ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయి. కేవలం 15 నుండి 20 రోజుల డేట్లు మాత్రమే మేకర్స్ శ్రీ లీలా నుంచి అడిగినట్టు సమాచారం. ఒకవేళ పవన్‌కి జోడీగా శ్రీ లీలా నటిస్తే మాత్రం అమ్మడి క్రేజ్‌ టాలీవుడ్‌‌లో మోస్ట్‌ క్రేజీ హీరోయిన్‌‌గా మారే అవకాశం ఉంది.

Also Read.

Pawan Kalyan : రాజకీయాల్లోకి రావడానికి కారణం ఇదే!

Advertisement

Next Story