వాళ్లంతా నిర్మాతల ఇంట్లోనే పని కానిచ్చేస్తారు.. స్టార్ కిడ్స్‌పై సోనమ్

by Vinod kumar |   ( Updated:3 May 2023 12:16 PM  )
వాళ్లంతా నిర్మాతల ఇంట్లోనే పని కానిచ్చేస్తారు.. స్టార్ కిడ్స్‌పై సోనమ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కిడ్స్‌పై సోనమ్ బజ్వా షాకింగ్ కామెంట్స్ చేసింది. సారా అలీఖాన్, అనన్యపాండే లాంటి నటీమణులకు నేరుగా కరణ్ జోహార్ వంటి నిర్మాతల ఇంటికి వెళ్లి మూవీ ఆడిషన్స్ ఇచ్చే వెలుసుబాటు ఉందంటూ ఆసక్తికరంగా మాట్లాడింది. తనలా కాకుండా బాలీవుడ్ నిర్మాతలతో వాళ్లకు మంచి సంబంధాలు ఉన్నాయన్న నటి.. స్టార్ కిడ్స్‌ పెద్దగా కష్టపడకుండానే సినిమాల్లోకి ప్రవేశం ఉంటుందని తెలిపింది.

అంతేకాకుండా బాలీవుడ్ చిత్రనిర్మాతలను డైరెక్ట్ సంప్రదించడమెలాగో వాళ్లకు బాగా తెలుసన్న సోనమ్.. "వాళ్లంత ఇరువురి ఇంటికి వెళ్లి చర్చించుకోచ్చు. ఆడిషన్‌కు రాకపోయినా సెలక్ట్ అవుతారు. మాలాంటి వాళ్లు ఎన్నో కష్టాలుపడి ఆడిషన్స్ వెళ్లినా.. చేతికందిన అవకాశం తృటిలో జారిపోతుంది" అంటూ బాలీవుడ్ స్టార్ కిడ్స్‌పై సోనమ్ బజ్వా షాకింగ్ కామెంట్స్ చేసింది.. ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను. నిరుత్సాహపడ్డాను’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

https://www.instagram.com/p/CpFta2ujCkJ/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CddXT5Voa8K/?utm_source=ig_web_copy_link

Next Story

Most Viewed