నా నడుము పట్టుకుని.. తన సొంత ఆస్తిలా ఫీల్ అయ్యాడు

by Prasanna |   ( Updated:2023-05-14 08:09:50.0  )
నా నడుము పట్టుకుని.. తన సొంత ఆస్తిలా ఫీల్ అయ్యాడు
X

దిశ, సినిమా: ‘రౌడీ రాథోడ్‌’ సినిమాలో అక్షయ్ కుమార్ తన నడుము పట్టుకుని చెప్పిన డైలాగ్‌పై సోనాక్షి సిన్హా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు 2012లో వచ్చిన మూవీలో ఓ కామెడీ సీన్‌లో భాగంగా ‘యే మేరా మాల్ హై’ (ఇది నా ఆస్తి) అంటూ అక్షయ్ చెప్పిన తీరు ఇప్పుడు నచ్చట్లేదని చెప్పింది. ఎందుకంటే అప్పట్లో తన ఆలోచన చాలా భిన్నంగా ఉండేవని, ఈరోజు అలాంటి పని అస్సలు చేయనని చెప్పింది. ‘కాలంతో పాటు పరిస్థితులు మారుతాయి. నేను కూడా మారాను. ఆ రోజు షూటింగ్‌లో భాగంగా పెద్దగా పట్టించుకోకపోయినా.. తర్వాత దానిగురించి ఆలోచిస్తే ఎందుకో అలాంటి సన్నివేశాలు చేయకూడదనిపించింది. ఇప్పుడు అలాంటి సీన్స్ చేయను’ అంటూ వివరించింది. చివరగా ప్రస్తుతం ప్రభుదేవాతో పాటు అక్షయ్ కుమార్‌తో సినిమా చేస్తున్నట్లు తెలిపింది.

Also Read..

శింబుకు జోడీగా దీపిక? కమల్ హాసన్ మాట వింటుందా?

స్త్రీల శరీరాలపై పంచులేయడమే మగాళ్లకు సరదా .. మేమూ రివేంజ్ తీసుకుంటాం

Advertisement

Next Story

Most Viewed