ఈ వయసులో కూడా ఆ విషయంలో తగ్గేదే లే ... అంటున్న చిరంజీవి

by Kavitha |   ( Updated:2024-03-21 05:55:01.0  )
ఈ వయసులో కూడా  ఆ విషయంలో  తగ్గేదే లే ... అంటున్న చిరంజీవి
X

దిశ, సినిమా: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నాడు. మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలొ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ సీన్స్ ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. ఇక ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని షూట్ చేశారట. అది కూడా బురద నేలపై తీశారట. అయితే చిరంజీవి ఎలాంటి డూప్ లేకుండా ఆ రిస్క్ యాక్షన్ సీన్ కంప్లీట్ చేశారు.

ఈ మద్య యంగ్ హీరోలు కూడా డుప్‌లను ఫుల్‌గా వాడుకుంటున్నారు అలాంటిది, 68 సంవత్సరాల వయస్సులో కూడా ఎలాంటి డుప్ ను వాడుకొకుండా, రిస్కీ సీన్స్‌ విషయంలో తగ్గేదిలేదు అంటున్నాడు చిరంజీవి. తన అభిమానులను ఆకట్టుకోడానికి ఎంతటి రిస్క్ అయిన చేయడానికి రెడీ అంటున్నాడు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. దీంతో చిరంజీవి డెడికేషన్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

Read More..

‘గేమ్ ఛేంజర్’ మూవీ ఓటీటీ హక్కులు అన్ని కోట్లా.. ఓ మై గాడ్

Advertisement

Next Story