నాకు అవి అంటే చాలా ఇంట్రెస్ట్.. మనసులోని మాటను బయటపెట్టిన మహేశ్ బాబు కూతురు

by Jakkula Samataha |   ( Updated:2024-01-26 09:08:56.0  )
నాకు అవి అంటే చాలా ఇంట్రెస్ట్.. మనసులోని మాటను బయటపెట్టిన మహేశ్ బాబు కూతురు
X

దిశ, సినిమా : మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చిన్నతనం నుంచి తన ఫొటోస్, డ్యాన్స్ ఫర్ఫామెన్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవలన జువెల్లరీ బ్రాండ్ యాడ్‌లో నటించి, తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. ఇక అప్పటి నుంచి సితారకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.

ముఖ్యంగా సితార హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంపై చాలా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ బుట్టబొమ్మకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది. రీసెంట్ గా తన తల్లి నమ్రత పుట్టిన రోజు నాడు, సితార అభిమానులతో చిట్ చాట్ చేసిన విషయం తెలిసిందే.

సంగతి మనకు తెలిసిందే.అయితే తన తల్లి బర్త్డే రోజు అభిమానులతో చిట్ చాట్ చేసింది సితార.ఇందులో భాగంగా ఓ నెటిజన్ మీరు సినిమాల్లోకి రావాలని అనుకుంటున్నారా అని ఒక ప్రశ్న అడగగా..నాకు సినిమాలు అన్నా నటన అన్నా చాలా ఇంట్రెస్ట్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాను తప్పకుండా అని చెప్పింది.

Advertisement

Next Story