ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సింగర్ సునీత.. షాక్‌లో ఫ్యాన్స్?

by Anjali |   ( Updated:2024-04-21 14:23:56.0  )
ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సింగర్ సునీత.. షాక్‌లో ఫ్యాన్స్?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె పాడిన ‘ఈ వేళలో నీవు’, మహేష్ బాబు నటించిన మురారీ చిత్రంలోని ‘అలనాటి రామచంద్రుని’ వంటి సూపర్ హిట్ సాంగ్స్‌కు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదంటే ఆమెకున్న ప్రత్యేకత ఏంటో తెలిస్తోంది. సునీత తన గానంతో తెలుగు ప్రేక్షకులందర్నీ మంత్రముగ్దుల్ని చేసిందనడంలో అతిశయోక్తిలేదు. ఇప్పటికీ కూడా పలు సినిమాల్లో పాటలు పాడుతూ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇకపోతే రామ్ వీరపనేని అనే వ్యక్తిని సునీత రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే ఈమెకు మొదటి భర్తతో ఇద్దరి పిల్లల సంతానం కలుగగా.. ఇప్పుడు రెండో భర్తతో 45 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనివ్వబోతుందంటూ నెట్టింట వార్తలు కుదిపేస్తున్నాయి. కాగా తాజాగా సునీత ఈ వార్తలపై స్పందించి.. ‘ఇప్పటికే ప్రెగ్నెన్సీ అంటూ నాపై వచ్చిన వార్తలపై స్పందించి జనాలకు క్లారిటీ ఇచ్చాను. మీ సమయాన్ని వృథా చేసుకుంటూ ఇలాంటి గాసిప్స్ క్రియేట్ చేయొద్దు. ఏమైనా ఉంటే మేము ఎందుకు దాచిపెడతాం. సంతోషంగా అందరితో పంచుకుంటాం’. అంటూ సునీత నెటిజన్లపై ఫైర్ అయినట్లు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికన చర్చించుకుంటున్నారు.

Read More : 45 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్.. సింగర్ సునీతపై మండిపడుతున్న ఫ్యాన్స్!

Advertisement

Next Story