చేతిలో బిడ్డతో నెట్టింట ప్రత్యక్షమైన యాంకర్ శివజ్యోతి!

by sudharani |   ( Updated:2023-06-27 12:37:41.0  )
చేతిలో బిడ్డతో నెట్టింట ప్రత్యక్షమైన యాంకర్ శివజ్యోతి!
X

దిశ, సినిమా: ఇటీవల కాలంలో టీవీ యాంకర్‌లు కూడా హీరోయిన్‌లతో సమానంగా పోటీపడి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ దక్కించుకుంటున్నారు. అందులో శివ జ్యోతి అలియాస్ సావిత్రక్క కూడా ఒకరు. ప్రొఫెషనల్‌గా తీన్మార్ ప్రోగ్రామ్‌ ద్వారా సావిత్రిగా ఎంట్రీ ఇచ్చిన శివజ్యోతి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టీవీ ఛానల్‌లో, ప్రైవేట్ ప్రోగ్రామ్స్‌కి యాంకర్‌గా బిజీగా ఉంటూనే మరోవైపు యూట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తోంది సావిత్రి. ఇక మనకు తెలిసినంతవరకూ ఆమెకు పిల్లలు లేరు.

అయితే తాజాగా చేతిలో బిడ్డతో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ ఫొటోలకు ‘ఇండియా జల్దిరా ప్లీజ్ వచ్చేవరకల్లా పెద్దమ్మా అని పిల్వలి సరే నా’ అంటూ రాసుకొచ్చింది. అంటే దాని బట్టి చూస్తే ఈ ఆ ఫొటోలో కనిపిస్తున్న బిడ్డ తన బంధువుల తరపు అని అర్థమవుతుంది. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్లు ‘మరి నువ్వెప్పుడు అమ్మవు అవుతావు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read More..

పెళ్లైన 15 రోజులకే విడాకులు తీసుకున్న బుల్లితెర జంట.. మీకు పెళ్లి అవసరమా అంటూ సింగర్ షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story