ముప్పై ఏళ్లుగా రానిస్తున్నా అందులో చోటే దక్కలేదు.. అదృష్టం లేదంటున్న శిల్పా

by Prasanna |   ( Updated:2023-09-03 07:20:55.0  )
ముప్పై ఏళ్లుగా రానిస్తున్నా అందులో చోటే దక్కలేదు.. అదృష్టం లేదంటున్న శిల్పా
X

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ముప్పై ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కెరీర్ అనుభవాలను అభిమానులతో షేర్ చేసుకుంది నటి శిల్పాశెట్టి. ముఖ్యంగా ఇన్నాళ్లుగా అనేక సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న తనకు స్టార్ హీరోయిన్ అనే ఇమేజ్ దక్కకపోవడంపై కూడా ఓపెన్ అయింది. ‘ప్రతి ఒక్కరి లైఫ్‌లో మంచి చెడులతోపాటు న్యాయం అనేది ఉంటుంది. నేను నా అభిమానులనుంచి ప్రేమ, సినిమాల పట్ల ప్రశంసలు గెలుచుకున్నా. కానీ టాప్ టెన్ నటీనటుల జాబితాలో మాత్రం నా పేరు ఇప్పటివరకూ చూసుకోలేదు. బహుశా ఆ ఛాన్స్ ఇక లేకపోవచ్చు, రాకపోవచ్చు. అయినా ఎవరి స్థానం వారికే ఉంటుంది. ఏది ఏమైనా ఒక ఉన్నత స్థానంలోనే ఉన్నందుకు హ్యాపీగానే ఫీల్ అవుతా’ అని చెప్పింది. ఇక ప్రస్తుతం తాను ఓ మల్టీ లాంగ్వేజ్ మూవీలో నటిస్తున్నానని, ఇటీవలే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లు చెప్పిన శిల్పా.. తన టాలెంట్ వల్లే ప్రేక్షకుల్లో ఓ స్థానం సంపాదించుకున్నందుకు అదృష్టవంతురాలిగానే భావిస్తానని తెలిపింది.

Advertisement

Next Story