Shehnaaz Gill: స్టార్ హీరో నంబర్ బ్లాక్ చేసిన నటి.. అదే కారణమట!

by Prasanna |   ( Updated:2023-04-14 08:17:53.0  )
Shehnaaz Gill: స్టార్ హీరో నంబర్ బ్లాక్ చేసిన నటి.. అదే కారణమట!
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ షెహనాజ్ గిల్ తనకున్న ఓ అలవాటు కారణంగా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా చాన్స్ మిస్ అయ్యేదని చెప్పింది.ఈ మేరకు తనకు తెలియని కొత్త నెంబర్ల నుంచి కాల్స్ వస్తే వెంటనే బ్లాక్ లిస్ట్‌లో పెట్టేస్తానన్న నటి.. అందులో భాగంగానే సల్మాన్ ఖాన్ నెంబరు కూడా బ్లాక్ చేసినట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపింది. ‘ఈ సినిమాకోసం సల్మాన్ సర్ నాకు కాల్ చేశారు. అయితే అది ఎవరో అనుకుని నేను పెద్దగా పట్టించుకోలేదు. రెండోసారి రాగానే నంబర్ బ్లాక్ చేశాను. దీంతో కొన్ని నిమిషాల వ్యవధిలోనే సల్మాన్ నాకు కాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే ఆ నంబర్ అన్ బ్లాక్ చేసి తిరిగి కాల్ చేశా. అప్పుడే ఈ మూవీ ఆఫర్ చేశాడు’ అంటూ షెహనాజ్ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి: నటుడు పోసాని కృష్ణ మురళికి కరోనా పాజిటివ్.. ఆసుపత్రికి తరలింపు

Next Story

Most Viewed