పబ్లిక్‌లోనే నీచం.. లిప్ లాక్‌తో రెచ్చిపోయిన స్టార్ జంట

by sudharani |
పబ్లిక్‌లోనే నీచం.. లిప్ లాక్‌తో రెచ్చిపోయిన స్టార్ జంట
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ‘కబీర్ సింగ్’ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. ఇదిలా ఉంటే.. షాహిద్ కపూర్, తన భార్య మీరా కపూర్ తాజాగా తన 8వ పెళ్లి రోజు వేడుకను జరుపుకున్నారు. కొన్ని వారాల క్రితం గ్రీస్‌కు వెళ్లిన ఈ జంట తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా.. శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

ఈ మేరకు షాహిద్ కపూర్ మీరాను ముద్దుపెట్టుకుంటున్న ఫొటోను షేర్ చేస్తూ.. "నక్షత్రాలతో నిండిన ఆకాశంలో.. నేను నీకు నా హృదయాన్ని ఇచ్చాను.. నా భార్యకు జీవితాంతం వార్షికోత్సవ శుభాకాంక్షలు" అనే క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఈ ఫొటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతుంటే మరికొందరు మాత్రం.. పబ్లిక్‌లో ఎంటీ ఈ ముద్దులు అంటూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

Next Story