షారుఖ్ ఖాన్ కూతురుగా వచ్చే గుర్తింపు అవసరం లేదు : సుహానా ఖాన్

by Prasanna |   ( Updated:2023-05-23 10:14:27.0  )
షారుఖ్ ఖాన్ కూతురుగా వచ్చే గుర్తింపు అవసరం లేదు : సుహానా ఖాన్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ మే 22న తన 23వ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తండ్రి స్టార్ డమ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నాకు 5 ఏళ్ల వయసు వచ్చే వరకు నా తండ్రి స్టార్ అనే విషయం తెలియదు. అయితే ఒకసారి ఆయన స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చారు. అందరూ తనని చూస్తూ ఆగిపోయారు. అప్పటినుంచి షారుఖ్ ఖాన్ కూతురిగా అందరూ నా మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. నిజానికి ఈ విషయంలో ఏ పిల్లలైనా గొప్పగా, గర్వంగా ఫీల్ అవుతారు. కానీ, నాకు నచ్చలేదు. వెంటనే నేను మా నాన్నని కారులోకి నెట్టేశాను. ఆ క్షణం నాకు నేనుగా నిర్ణయించుకున్నా. మా నాన్న వల్ల వచ్చే గుర్తింపు నాకు అవసరం లేదని’ అంటూ చెప్పుకొచ్చింది.

Read More: మహేష్ బాబుపై ఆ రూమర్స్.. నెటిజన్లపై ఫ్యాన్స్ ఫైర్

Advertisement

Next Story