- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
SRK అంటే షారుఖ్ కాదు.. 'శేఖర్ రాధా కృష్ణ': బాద్ షా
దిశ, సినిమా: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇండియన్ కల్చర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మేరకు గతంలో ఓ ఈవెంట్‌లో పాల్గొన్న తనను SRK అంటే 'శేఖర్ రాధా కృష్ణ'గా పిలిచారని గుర్తు చేసుకున్న హీరో.. ఈ దేశంలో తానెప్పుడూ ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా ఫీల్ అవలేదని చెప్పాడు. ఇక మన ఇండియన్స్ పేరును బట్టి ప్రేమ కురిపించరన్న ఆయన.. కులమతాలకు అతీతంగా మానత్వాన్ని చాటడమే ఈ దేశం గొప్పతనమంటూ ప్రశంసలు కురిపించాడు. 'పేరును బట్టి తేడాలు చూపిస్తారని నేనెప్పుడూ అనుకోను. ఈ అద్భుతమైన దేశంలో ఒక మతానికి సంబంధించిన ప్రత్యేక వృత్తిని ఎప్పుడూ ఎక్కడ చూడలేదు. నిజంగా ఇది వింతగా అనిపిస్తుంది. ముఖ్యంగా కళాకారులు మనుషుల విభజనలను అధిగమించే చైతన్యాన్ని కలిగి ఉంటారని భావిస్తాను. నటీనటులు ఏ సంఘం, వర్గం, కులం నుంచి వచ్చినా ప్రేక్షకులు సమానంగా ఆదరిస్తారు. అందుకే మీరు నన్ను ఏ పేరుతో పిలిచినా ఇబ్బంది పడను. అందులో మధురమైన భావనను మాత్రమే అనుభవిస్తా' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆధ్యాత్మిక అనేది ఒక ప్రైవేట్ విషయంగా చూడాలన్న హీరో.. తనకు విశ్వవ్యాప్తంగా గుర్తింపునిచ్చిన నటననే తన మతంగా చెప్పుకుంటానని తెలిపాడు.