ఐదు సార్లు సినిమా చూసిన అభిమాని.. హీరో నుంచి కోటి డిమాండ్

by sudharani |   ( Updated:2023-02-18 08:52:24.0  )
ఐదు సార్లు సినిమా చూసిన అభిమాని.. హీరో నుంచి కోటి డిమాండ్
X

దిశ, సినిమా : షారుఖ్ ఖాన్ 'పఠాన్' బ్లాక్ బస్టర్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. కలెక్షన్స్ పరంగా ఇప్పటికే 'బాహుబలి' రికార్డులను కూడా బ్రేక్ చేసింది. ఈ హ్యాపీ టైమ్‌లో ట్విట్టర్‌లో #AskSRK సెషన్ హోస్ట్ చేశాడు షారుఖ్. ఈ క్రమంలో ఓ అభిమాని హీరోకు చేసిన రిక్వెస్ట్, ఇచ్చిన రిప్లయ్ రెండూ వైరల్ అవుతున్నాయి.

'షారుఖ్ నేను ఇప్పటికే ఐదు సార్లు సినిమా చూశా. మరిన్ని సార్లు చూడాలని ఉంది. రూ. 700 కోట్ల కలెక్షన్స్‌లో రూ. కోటి ఇవ్వగలవా?' అని అడిగాడు అభిమాని. దీనికి రిప్లయ్ ఇచ్చిన షారుఖ్.. 'భాయ్.. ఇంత రేట్ ఆఫ్ రిటర్న్ షేర్ మార్కెట్‌లో కూడా ఉండదనుకుంటా. ఇంకొన్ని సార్లు చూడండి అప్పుడు చూద్దాం' అంటూ నవ్వేశాడు.

Advertisement

Next Story