- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
60 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకున్న సీనియర్ నటుడు.. ఫొటోస్ వైరల్

దిశ, వెబ్‌డెస్క్: 2000లో ‘పాపే నా ప్రాణం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటుడు ఆశిష్ విద్యార్థి. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. దాదాపుగా 11 భాషల్లో సినిమాలు చేశారు. 20 ఏళ్ల క్రితం బెంగాలీ నటి రాజోషీని పెళ్లి చేసుకుని ఓ బాబుకు కూడా జన్మనిచ్చారు. కానీ అభిప్రాయ బేధాల కారణంగా ఇద్దరు విడిపోయారు.
ఇక అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ఆశిష్.. అస్సాంకు చెందిన రూపాలి బరోవాసు అనే మహిళను ప్రేమించారు. ఈ నెల 25న ఆమెను వివాహం చేసుకున్నారు. అతికొద్ది మంది స్నేహితుల, బంధువుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఇక 60 ఏళ్ల వయసులో ఆయన పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్యపరచడంతో.. వివాహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆశిష్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్‌పురి, కన్నడ భాషల్లో ఇప్పటి వరకు మొత్తం 300 సినిమాలకు పనిచేశారు.
ఇవి కూడా చదవండి:
ఆమెతో ఎంతో ట్రై చేశా కానీ సెట్ కాలే.. అందుకే విడిపోయాం.. విడాకులపై నటుడు కామెంట్