Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ నుంచి సెకండ్ సింగిల్.. మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టిన రవితేజ, భాగ్యశ్రీ

by sudharani |
Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ నుంచి సెకండ్ సింగిల్.. మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టిన రవితేజ, భాగ్యశ్రీ
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోవడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరేవగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఆగస్టు 15న థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది.

ఈ క్రమంలోనే వరుస అప్‌డేట్స్‌తో సందడి చేస్తున్న చిత్ర బృందం. ఈ మేరకు ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగింల్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘రెప్పల్ డప్పుల్’ అంటూ సాగే ఈ సాంగ్ హైలీ ఎనర్జిటిక్‌తో పాటు ఫుల్ మాస్ బీట్‌లతో ప్రేక్షకులను అలరిస్తుంది. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే డ్యాన్స్ ఫ్లోర్‌‌ని ఆదరగొట్టారు. ప్రజెంట్ ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది.



Next Story