‘యానిమల్’లో రష్మిక-రణ్‌బీర్ ఫస్ట్ నైట్ సీన్.. రెండు వేరియేషన్స్‌తో ప్లాన్ చేసిన సందీప్?

by Prasanna |
‘యానిమల్’లో రష్మిక-రణ్‌బీర్ ఫస్ట్ నైట్ సీన్.. రెండు వేరియేషన్స్‌తో ప్లాన్ చేసిన సందీప్?
X

దిశ, సినిమా: బాలీవుడ్ అప్ కమింగ్ పాన్ ఇండియా చిత్రాల్లో ‘యానిమల్’ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్‍బీర్ కపూర్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని టీ సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్‌ పతాకాలపై ప్రముఖ హిందీ నిర్మాత భూషణ్‌ కుమార్‌, ప్రణవ్‌ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ చూస్తే ఒక రేంజ్ వైలెన్స్ కనిపిస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డిసెంబర్ 1న సినిమా విడుదలకానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం సందీప్ రెడ్డి వంగా ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా మధ్య ఫస్ట్ నైట్ సీన్ వెరైటీగా ప్లాన్ చేశాడట. అంటే వీరి ఫస్ట్ నైట్ జరిగే సమయంలో విలన్స్ అటాక్ చేస్తారట. అప్పుడు విలన్ లతో ఫైట్ చేస్తూ.. మరోవైపు రష్మికతో రొమాన్స్ చేస్తాడట రణ్‌బీర్. ఈ మూవీలో ఈ సీన్ చాలా హైలెట్ అని టాక్.

Advertisement

Next Story