- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అక్కినేని అఖిల్ నెక్ట్స్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సమంత..!
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ బాల నటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మనం, మజ్ను, బ్యాచ్‌లర్ చిత్రాల్లో నటించి ఫ్యాన్స్‌లో పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇటీవల ‘ఏజెంట్’ మూవీతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా కోసం అఖిల్ ఎంతగా కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈసారైనా హిట్ కొట్టాలని అఖిల్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నాడు. ‘ధీర’ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకకెక్కిస్తున్నారు. దీనికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెట్టుబడిలో పార్టనర్‌గా వ్యవహిరిస్తున్నాడు. ఈ సినిమాకు అనిల్ కుమార్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా, అఖిల్ ‘ధీర’ లో స్టార్ హీరోయిన్ సమంత ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అఖిల్ సినిమాలో చేయమని అడగగానే దానికి సామ్ కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో హీరోయిన్‌గా నటిస్తుందా? ఏదైనా కీలక పాత్రల్లో నటిస్తుందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా సమంత, నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటికీ అఖిల్‌తో మాత్రం స్నేహంగానే ఉంటోంది. ప్రస్తుతం సామ్, చైతు వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.