సూపర్ స్టార్‌తో ఫొటో కోసం వెళ్తే.. నటి హేమను కుక్కలాగా బయటకు తరిమేసిన సెక్యూరిటీ

by Anjali |   ( Updated:2023-06-20 11:54:58.0  )
సూపర్ స్టార్‌తో ఫొటో కోసం వెళ్తే.. నటి హేమను కుక్కలాగా బయటకు తరిమేసిన సెక్యూరిటీ
X

దిశ, సినిమా: ‘దబాంగ్ 3’ నటి హేమా శర్మ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. 2019లో జరిగిన సంఘటనను తలుచుకుంటూ ఏడ్చేసిన ఆమె.. సల్మాన్‌తో ఫొటో దిగేందుకు వెళ్తే సెక్యూరిటీ గార్డ్స్ తనను కుక్కలాగా బయటకు తోసేశారని తెలిపింది. కేవలం సల్లూ కోసమే ‘దబాంగ్ 3’లో నటించాలని అనుకున్నానని.. కానీ తీరా అవకాశం వచ్చాక ఆయనతో షాట్ క్యాన్సల్ చేశారని చెప్పింది. దీంతో తాను సెట్‌లో సల్మాన్‌ను కలిసేందుకు దాదాపు 50మందిని రిక్వెస్ట్ చేశానని, అయినా వర్కవుట్ కాలేదని తెలిపింది. చివరకు ‘బిగ్ బాస్’ సెట్ దగ్గర ఒకరి రికమెండేషన్‌తో ఆయనతో ఫొటో దిగేందుకు ట్రై చేస్తే.. సెక్యూరిటీ గార్డ్స్ దారుణంగా లాగేశారని ఏడ్చింది. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వాలని సల్మాన్ చెప్తూ ఉంటాడు కదా.. ఇదేనా మీరు స్త్రీలకు ఇచ్చే గౌరవం? అని ప్రశ్నించింది హేమా శర్మ.

Click here For Instagram link

Advertisement

Next Story

Most Viewed