Faima: రూ.500 అప్పు.. చచ్చిపోతానని రూమ్‌లో కెళ్లి డోర్ పెట్టుకున్న.. 'జబర్దస్త్' ఫైమ సంచలన కామెంట్స్

by Kavitha |
Faima: రూ.500 అప్పు.. చచ్చిపోతానని రూమ్‌లో కెళ్లి డోర్ పెట్టుకున్న.. జబర్దస్త్ ఫైమ సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: జబర్దస్త్ షో ద్వారా చాలా మంది పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో ఫైమా కూడా ఒకరు. తన కామెడి టైమింగ్, ఇమ్మిడియట్ పంచ్‌లతో ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఈమె స్టార్టింగ్‌లో పటాస్ కామెడి షోతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. అలాగే తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా పాల్గొని అక్కడ కూడా తన కామెడీతో, గేమ్స్‌తో ఆకట్టుకుంది. కానీ విన్నర్ మాత్రం కాలేకపోయింది. ప్రస్తుతం జబర్దస్త్ షో చేస్తూ తనకంటూ సపరేట్ ఫేమ్‌ను క్రియేట్ చేసుకుంది ఫైమా.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫైమా.. పటాస్ షోలో కమెడియన్‌గా ఛాన్స్ వచ్చినప్పుడు తన ఇంట్లో ఎలా ఒప్పించింది అనే విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను పటాస్‌కు వెళ్లేవరకు కూడా మా ఇంట్లో టీవీ లేదు, ఆ షో గురించి కూడా నాకు తెలియదు. అయితే పటాస్ టీమ్ వారు కొంతమంది స్టూడెంట్స్‌ను ఆడియన్స్‌లుగా తీసుకురమ్మని మా కాలేజ్ వాళ్లకు చెప్పారు. ఒక్కొక్క స్టూడెంట్‌కు రూ. 500 ఛార్జ్ చేసి ఒక పిక్నిక్ లాగా ఆ షోకు తీసుకెళ్లారు. అప్పుడు నా దగ్గర రూ. 500 కూడా లేవు. కానీ మా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుని మరీ ఆ షో కి వెళ్లాను.ఇక అక్కడ నేను చేసిన కామెడీతో వచ్చిన ప్రోమో బాగా ఫేమస్ అయింది. దాంతో ‘‘ఒక ప్రోమో వల్ల ఇంత హైప్ వచ్చిందంటే భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుంది కదా అని అమ్మకు చెప్పాను. హైదరాబాద్ అంటే ఏంటో తెలియదు అని అమ్మ వద్దంది.

దీంతో వాళ్లు ఒప్పుకోలేదని రెండు రోజులు అన్నం తినలేదు. అంటే వాళ్ల ముందు తినలేదు. వాళ్ళు బయటికి వెళ్లినప్పుడు తినేదాన్ని. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. నేను ఏడిస్తే తట్టుకోలేడు. ఆయన అదర్ కంట్రీలో ఉండేవారు. ఆయన కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు. వెంటనే రూమ్లోకి వెళ్లి డోర్ పెట్టేసుకొని చచ్చి పోతాను అన్నాను. అంతే ఇక అమ్మ భయపడి ఒప్పుకుంది’’ అని ఫైమా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story