Ravi Teja :భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ.. ఎన్ని కోట్లంటే..?

by sudharani |   ( Updated:2023-06-13 15:38:24.0  )
Ravi Teja :భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ.. ఎన్ని కోట్లంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలో ఒక్క సినిమా హిట్ కొట్టిందంటే చాలు నటీనటులు ఈజీగా వారి రెమ్యునరేషన్ పెంచేస్తారు. అయితే ఫ్యాన్స్ బేస్‌ను దృష్టిలో పెట్లుకుని.. సినిమా హిట్ అయిన ప్లాప్ అయిన కూడా కొంత మంది హీరోలు వారి రెమ్యునరేషన్ పెంచేస్తుంటారు. అలాంటి వారిలో మాస్ మహారాజ రవితేజ చేరినట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన సినిమా ‘రావణాసుర’ ప్లాప్.. కానీ ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే పారితోషికం భారీగా పెంచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక కలర్ ఫొటో ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వంలో వస్తున్న ఓ సినిమాలో నటించడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీకి రవితేజ ఏకంగా రూ. 25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే మాస్ మహారాజ నటించిన ‘ధమాకా’ సినిమా కూడా ఇదే బ్యానర్‌లో వచ్చి మంచి లాభాల్ని అందుకుంది. దీంతో రవితేజ ఎంత డిమాండ్ చేస్తే అంత ఇచ్చేందుకు నిర్మాతలు సైతం రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. రవితేజ రెమ్యునరేషన్ మేటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా వైరల్ అవుతోంది.

Read more: ఎంగేజ్‌మెంట్ తర్వాత వరుణ్ - లావణ్య దిగిన ఫోటో వైరల్

Advertisement

Next Story

Most Viewed