ఆ ట్యూన్ విన్నప్పుడల్లా గుండె తరుక్కుపోతుంది.. షారుఖ్ చెప్పిన నేను వినలేదు

by Aamani |   ( Updated:2023-05-21 11:08:47.0  )
ఆ ట్యూన్ విన్నప్పుడల్లా గుండె తరుక్కుపోతుంది.. షారుఖ్ చెప్పిన నేను వినలేదు
X

దిశ, సినిమా : షారుఖ్, మణిరత్నం కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘దిల్ సే’లో ఐటమ్ సాంగ్ రిజెక్ట్ చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది రవీనా టాండన్. 1998లో వచ్చిన ఈ మూవీలో ‘చయ్య చయ్య’ సాంగ్ భారీ పాపులారిటీ పొందింది. కాగా ఈ పాటలో షారుఖ్ సరసన నటించేందుకు తనకు ఆఫర్ వచ్చిందని చెప్పిన నటి.. ‘మణి సార్, షారుఖ్ ఇద్దరు నన్ను పిలిచి ఈ పాట చేయడమని అడిగారు. అయితే ఆ సమయంలో ఐటమ్ గర్ల్‌గా ముద్ర వేయించుకోవడం నాకు నచ్చలేదు. అలాంటివి చేయడానికి ఇష్టం కూడా లేదు. దీంతో ఆఫర్‌ను తిరస్కరించాను. కొద్దిరోజుల టైమ్ కూడా తీసుకోమని చెప్పిన నేను వినలేదు’ అని తెలిపింది. ఇక మలైకా అరోరా నటించిన ఆ పాట ట్యూన్ విన్నప్పుడల్లా తన గుండె తరుక్కుపోతుందన్న రవీనా.. అందివచ్చిన గొప్ప అవకాశం కొల్పోయినందుకు చాలా బాధపడతున్నట్లు చెప్పుకొచ్చింది.


Also Read...

ప్యాంట్ విప్పి అండర్ వేర్ చూపించిన టాలీవుడ్ హీరోయిన్

Advertisement

Next Story