‘రంగబలి’ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది: నాగ శౌర్య

by sudharani |   ( Updated:2023-07-03 12:03:02.0  )
‘రంగబలి’ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది: నాగ శౌర్య
X

దిశ, సినిమా: నాగ శౌర్య, పవన్ బాసంశెట్టి కాంబోలో వస్తున్న చిత్రం ‘రంగబలి’. ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటించగా జూలై 7న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో మాట్లాడుతూ.. ‘కనకాల సుమ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఉండటం ఆనందంగా ఉంది. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. మంచి సినిమాను ప్రేక్షకులకు ఆదరిస్తారనే నమ్మకముంది. చిత్రానికి పనిచేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’ చెప్పాడు. అలాగే ముఖ్య అతిధిగా మాట్లాడటం ఆనందంగా ఉందన్న సుమ.. ఇలాంటి కమర్షియల్ సబ్జెక్ట్, ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ పెద్ద హిట్ అవుతుందంటూ ఆల్ ది బెస్ట్ చెప్పింది. చివరగా మాట్లాడిన.. దర్శకుడు, యుక్తి తరేజ, కిషోర్ తిరుమల, శ్రీకాంత్ ఓదెల.. శౌర్య హీరోయిజం, ఎమోషన్ కొత్తగా చూస్తారని, ఎక్కడ రాజీపడకుండా తీసిన చిత్రానికి ఘన విజయం అందిచాలని కోరారు.

Read More: Bimbisara-2: క‌థ రెడీ కాకముందే.. ‘బింబిసార 2’కు రూ.100 కోట్ల ఆఫర్‌!

Advertisement

Next Story