Rana Naidu: రానా.. తన కుటుంబంతో కలిసి ఈ వెబ్ సిరీస్ చూడగలడా? అంటూ.. ప్రశ్నిస్తున్న నెటిజెన్స్?

by Prasanna |   ( Updated:2023-03-13 04:07:46.0  )
Rana Naidu: రానా.. తన కుటుంబంతో కలిసి ఈ వెబ్ సిరీస్ చూడగలడా?  అంటూ..  ప్రశ్నిస్తున్న నెటిజెన్స్?
X

దిశ, వెబ్ డెస్క్ : రానా, వెంకటేశ్‌ మొదటి సారి నటించిన వెబ్‌ సిరీస్‌ రానా నాయుడు. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ వెబ్ సిరీస్లో విక్టరీ వెంకటేష్‌ నటించడంతో వెంకీ అభిమానుల ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఈ వెబ్‌ సిరీస్‌లో పెద్ద మైనస్ ఏంటంటే అసభ్యకరమైన సన్నివేశాలు ఎక్కువగా ఉండటం వల్ల అందరూ మండిపడుతున్నారు. ఈ ఇష్యూ పై రానా స్పందించక పోతే తరవాత విడుదలయ్యె సినిమాలకు ఎఫెక్ట్ పడుతుందనే చెప్పుకోవాలి. కుటుంబంతో కలిసి అసలు చూడలేమని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. శృతి మించిన శృంగారం, అన్ని భూతులే ఉన్నాయంటూ వాదనలు బాగా వినిపిస్తున్నాయి. రానా.. తన కుటుంబంతో కలిసి ఈ వెబ్ సిరీస్ చూడగలడా అంటూ మీమ్స్‌ను క్రియేట్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : నాకు ఎప్పుడో పెళ్లి జరిగింది తమన్నా షాకింగ్ కామెంట్స్..!!

Advertisement

Next Story