Vyuham : ఒకే పోస్టర్‌తో వ్యూహం, శపథం రిలీజ్ డేట్స్ చెప్పేసిన Ram Gopal Varma

by Prasanna |   ( Updated:2023-10-11 06:05:22.0  )
Vyuham : ఒకే పోస్టర్‌తో వ్యూహం, శపథం రిలీజ్ డేట్స్ చెప్పేసిన Ram Gopal Varma
X

దిశ,వెబ్ డెస్క్: వర్మ సినిమా బయటకొస్తుందంటే..చాలు అందరిలో ఒక టెన్షన్ మొదలవుతుంది. ఈ సారి ఎవరిని టార్గెట్ చేస్తూ సినిమా తీసాడంటూ.. ఆరాలు తీయడం మొదలు పెడతారు. అలాగే సినిమాల్ని అనౌన్స్‌చేయడంలో, ప్రమోషన్స్ చేయడంలో వర్మ ప్లాన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. తన సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో వెరైటీగా అడుగులు వేస్తుంటారు. సినిమా ప్రమోషన్స్‌లో వర్మ తర్వాతే ఎవరైనా..! ప్రస్తుతం ఏపీ సీఏం వైఎస్ జగన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా వ్యూహం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌ను కూడా అనౌన్స్ చేశాడు.

ఈ సీక్వెల్‌కు శపథం అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసారు. ఒకే పోస్టర్ ద్వారా వ్యూహం, శపథం సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్‌చేశాడు. వ్యూహం సినిమాను నవంబర్ 10న, శపథం సినిమాను 2024 జనవరి 25న రిలీజ్ చేయబోతున్నట్లు వర్మ ప్రకటించాడు. వ్యూహం, శపథం సినిమాల్లో వైఎస్ జగన్ పాత్రలో రంగం ఫేమ్ అజ్మల్ నటిస్తోన్నాడు. వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించబోతున్నది. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ ఈ పొలిటికల్ మూవీస్‌ను నిర్మిస్తోన్నాడు.

Advertisement

Next Story