రామ్ చరణ్ సతీమణి ఉపాసన 9 నెలలు గడవక ముందే తల్లి అయిందా?

by Hamsa |   ( Updated:2023-06-20 08:41:36.0  )
రామ్ చరణ్ సతీమణి ఉపాసన 9 నెలలు గడవక ముందే తల్లి అయిందా?
X

దిశ, వెబ్ డెస్క్: మెగా స్టార్ చిరంజీవి, రామ్ చరణ్-ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారని గత ఏడాదిలో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి మెగా అభిమానులు ఉపాసనకు బాబు, పుడతాడా, పాప పుడుతుందా అని ఎన్నో ఆశలతో ఎదురుచూశారు. అయితే మెగా కోడలు ఉపాసనకు కొద్ది సేపటి క్రీతమే ఆడపిల్ల పుట్టింది. దీంతో ఈ విషయం తెలిసిన వారు మెగా ఫ్యామిలీలో ప్రిన్సెస్ వచ్చిందంటూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా, ఉపాసన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉపాసన-రామ్ చరణ్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు చిరంజీవి గత ఏడాది డిసెంబర్ 12న ట్విట్టర్ వేదికగా తెలిపారు. అయితే దీనిని బట్టి చూస్తే ఉపాసన తొమ్మిది నెలలు గడవక ముందే బిడ్డకు జన్మనిచ్చినట్లుగా తెలుస్తోంది. అప్పటి నుంచి కౌంట్ చేస్తే మెగా కోడలికి 7 నెలలకే డెలివరీ అయిందని కొందరూ అంటున్నారు. అంతేకాకుండా చిరంజీవి చేసిన ట్వీట్‌ను వైరల్ చేస్తున్నారు.

Read More: ఉపాసన డెలివరికి 3 నెలల ముందే ఆడపిల్ల పుడుతుందని తెలుసా? ఫొటో వైరల్

Advertisement

Next Story