నిఖిల్‌కు రామ్ చరణ్ సర్‌ప్రైజ్ కాల్

by sudharani |
నిఖిల్‌కు రామ్ చరణ్ సర్‌ప్రైజ్ కాల్
X

దిశ, సినిమా : 'కార్తికేయ 2' చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. హీరో నిఖిల్ కెరియర్‌లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నిఖిల్‌కు ఫోన్ చేసిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. 'కార్తికేయ 2' బ్లాక్‌బస్టర్‌ అయినందుకు అభినందనలు తెలిపారు. సినిమా చూసిన వెంటనే నిఖిల్‌కు కాల్ చేసిన చెర్రీ.. రిజల్ట్‌లో టీమ్ ఎఫర్ట్ కనబడిందని అన్నారు. ఇక దర్శకుడు చందూ మొండేటి అద్భుతమైన కంటెంట్ తీసుకున్నారంటూ హీరోయిన్ అనుపమ సహా చిత్ర బృందాన్ని సైతం ట్విట్టర్‌ వేదికగా ప్రశంసించారు.

Advertisement

Next Story