రజనీకాంత్-లోకేష్ కనగరాజ్ కాంబో ఫిక్స్!

by Hamsa |   ( Updated:2023-09-11 10:06:21.0  )
రజనీకాంత్-లోకేష్ కనగరాజ్ కాంబో ఫిక్స్!
X

దిశ, సినిమా: ‘జైలర్’తో మంచి హిట్ అందుకున్న రజనీకాంత్ తన నెక్ట్స్ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌పిక్చర్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకోబోతున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక నటీనటుల పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ప్రస్తుతం లోకేష్ ‘లియో’తో ప్రేక్షకుల అలరించబోతున్నాడు. విజయ్ దళపతి-త్రిష జంటగా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ మూవీ విడుదల కాగానే తలైవా సినిమా పనులు మొదలుపెట్టి, వీలైనంత త్వరగా పూర్తిచేసి, దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నాడట లోకేష్.

Advertisement

Next Story