'RRR'కు ముందు నుంచే ఆ సమస్యతో బాధపడుతున్న రాజమౌళి

by sudharani |   ( Updated:2022-12-02 11:07:21.0  )
RRRకు ముందు నుంచే ఆ సమస్యతో బాధపడుతున్న రాజమౌళి
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి అందరికీ తెలిసిందే. బాహూబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. RRR సినిమాతో ఆ స్థానాన్ని మరింత బలపరుచుకున్నాడు. దీంతో రాజమౌళి ఖ్యాతిని గురించి అమెరికాలోనే లార్జెస్ట్ సర్క్యూలేషన్ కలిగిన పేపర్స్‌లో ఒకటైన 'లాస్ ఏంజిల్స్ టైమ్స్'.. రాజమౌళి గురించి స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది.

ఇదిలా ఉంటే.. RRR సినిమా టైంలో రాజమౌళి ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ఆ విషయాన్ని స్వయంగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ''RRR సినమా ప్రారంభానికి ముందు రాజమౌళి ఆస్తమాతో బాధపడుతున్నారని తెలిసింది. అయినా కూడా షూటింగ్ పనులు ఆపకుండా అలానే పూర్తి చేశారు. ఆయన దృష్టి అంతా సినిమాను ఎంత బాగా ప్రెజెంట్ చేయాలనే దాని పైనే ఉండేది. సినిమా అద్భుతంగా రావాలని అనుక్షణం తాపత్రయపడేవారు'' అంటూ చెప్పుకొచ్చింది.


Next Story

Most Viewed