ఆ జ్యోతిష్యుడి మాట జవదాటని రాజమౌళి.. అందుకే మహేష్ మూవీ ఆలస్యమవుతుందా?

by Anjali |   ( Updated:2023-09-05 09:58:46.0  )
ఆ జ్యోతిష్యుడి మాట జవదాటని రాజమౌళి.. అందుకే మహేష్ మూవీ ఆలస్యమవుతుందా?
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు.. టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ29’’. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ జరిగినా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. కావాలనే ఈ మూవీ పూజ, షూట్ వాయిదా వేస్తున్నారని నెట్టింట ఓ వార్త వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ హాట్ న్యూస్‌ వైరల్‌గా మారింది. జక్కన్న ప్రతి సినిమాకు కీరవాణి దైవంగా కొలిచే ఓ జ్యోతిష్యుడితో సంప్రదింపులు జరిపి రాజమౌళి జాతకాన్ని చూపించి.. సినిమా ప్రారంభిస్తారు.

కర్ణాటకలో ఉండే ఆ జ్యోతిష్యుడి మాటను రాజమౌళి అస్సలు జవదాటడట. అయితే ఎప్పటిలాగే కీరవాణి కర్ణాటక వెళ్లి జక్కన్న జాతకం చూపించగా.. ఇప్పుడు ఆయనకు మంచి గడియలు లేవు. ఈ సంవత్సరం ఎలాంటి కొత్త చిత్రాలు సెట్స్ మీదకు తీసుకెళ్లకూడదని, అలా చేస్తే సినిమాపై గ్రహాల చెడు ప్రభావం పడుతోందని చెప్పారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి ఇలాంటి జాతకాలు కూడా నమ్ముతారా? అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఎంతవరకు నిజమో తెలియదు కానీ, నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story