- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ సాంగ్ ప్రదర్శన
దిశ, వెబ్ డెస్క్: జక్కన్న రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన RRR మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమా ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ కేటాగిరిలో నాటు నాటు సాంగ్ కు ఈ అవార్డు లభించింది. ఇదే కేటాగిరిలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. ఈ నెలలో 95వ ఆస్కార్ అవార్డుల వేడుకను అమెరికాలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇక తాజాగా ఆ వేడుకలకు సంబంధించిన ఓ అప్డేట్ ను ఆస్కార్ అకాడమీ అందించింది. ఆస్కార్ వేదిక మీద నాటు నాటు సాంగ్ ప్రదర్శన ఉంటుందని పేర్కొంది. ఈ పాటను ఒరిజినల్ సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లైవ్ లో ఆలపించనున్నట్లు పేర్కొంది.
ఈ మేరకు అకాడమీ ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టింది. మార్చి 12వ తేదీన ఆస్కార్ వేదిక మీద నాటు నాటు సాంగ్ ప్రదర్శన ఉంటుందని తెలిపింది. కాగా ఒరిజినల్ కేటాగిరిలో నామినేషన్ పొందిన అన్ని పాటలను ఆస్కార్ వేదిక మీద ప్రదర్శిస్తారు. ఇక నాటు నాటు సాంగ్ ను చంద్రబోస్ రాయగా ఎంఎం కీరవాణి బాణీలు సమకూర్చారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ సూపర్ కొరియోగ్రఫీ అందించగా.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ స్టెప్పులతో ఇరగదీశారు.
Also Read: Pawan kalyan సీఎం అవుతారా.. ఈ ప్రశ్నకు నాటి స్టార్ హీరోయిన్ కామెంట్స్ ఇవే!