- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేసింగ్ డ్రైవర్స్ ఒకేసారి కనురెప్పలు మూస్తారు.. తాజా పరిశోధన
దిశ, ఫీచర్స్: మనం సాధారణంగా నిమిషానికి 12 సార్లు బ్లింక్ చేస్తాము. ప్రతి బ్లింక్ సెకనులో మూడింట ఒక వంతు ఉంటుంది. కొంతమంది వ్యక్తులు స్క్రీన్‌పై దృష్టి కేంద్రీకరించినప్పుడు తక్కువ సార్లు కనురెప్పలు మూస్తారని.. అది పనిపై కాన్సంట్రేషన్‌తో లింక్ చేయబడి ఉంటుందని తేలింది. అలాగే ప్రొఫెషనల్ రేసింగ్ డ్రైవర్లు కారును నియంత్రించడంపై దృష్టి పెట్టినప్పుడు ట్రాక్‌లో ఒకే పాయింట్ వద్ద కనురెప్ప వేస్తారని గుర్తించింది తాజా పరిశోధన. ఇది వారి సింక్రోనైజ్డ్ మెంటల్ స్టేట్, నిర్దిష్ట అభిజ్ఞా స్థితిని ప్రతిబింబిస్తుంది.
రెప్పవేయడం అనేది మన కళ్లను లూబ్రికేట్ చేస్తుంది. కానీ అది మన ఆరోగ్యానికి సంబంధించిన ఇతర అంశాలకు ఎలా లింక్ చేయబడుతుందో అస్పష్టంగా ఉంది. దీన్ని మరింత అధ్యయనం చేయడం వలన పార్కిన్సన్స్ వ్యాధి వంటి బ్లింక్ రేట్లు మారే పరిస్థితులను బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుందని అభిప్రాయపడుతున్నారు పరిశోధకులు.