Apsararani :టిక్కు టిక్కు అంటూ కిక్కెక్కిస్తున్న అప్సరా రాణి ‘రాచరికం’..

by sudharani |   ( Updated:2024-09-06 16:00:00.0  )
Apsararani :టిక్కు టిక్కు అంటూ కిక్కెక్కిస్తున్న అప్సరా రాణి ‘రాచరికం’..
X

దిశ, సినిమా: అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘రాచరికం’. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈశ్వర్ నిర్మిస్తున్న ఈ మూవీకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమా మీద అంచనాలు పెంచగా.. తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. టిక్కు టిక్కు అంటూ సాగే ఈ హుషారైన పాటను పెంచల్ దాస్ రాయగా.. పెంచల్ దాస్, మంగ్లీ గాత్రంలో ఈ పాట కిక్కిచ్చేలా ఉంది. పర్‌ఫెక్ట్ జాతర సాంగ్‌లా ఎంతో రిచ్‌గా తెరకెక్కించినట్టుగా కనిపిస్తున్న ఈ పాటకు అప్సరా రాణి అదిరిపోయే స్టెప్పులతో అదరగొట్టింది. కాగా.. ఈ చిత్రంలో హైపర్ ఆది, రంగస్థలం మహేష్, విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాష, రూపేష్ మర్రాపు, ప్రాచీ థాకర్, లత, ఈశ్వర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Advertisement

Next Story

Most Viewed