Priyanka Jawalkar : ఆ హీరో అంటే చెప్పలేనంత పిచ్చి.. కానీ !

by Prasanna |   ( Updated:2023-01-16 12:09:15.0  )
Priyanka Jawalkar : ఆ హీరో అంటే చెప్పలేనంత పిచ్చి.. కానీ !
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్‌పై యంగ్ బ్యూటీ ప్రియాంక జవల్కార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నిజానికి పవన్ అంటే తనకు చాలా ఇష్టమన్న బ్యూటీ ఒకవేళ ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా రిజెక్ట్ చేస్తానని చెప్పింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన నటి.. 'పవర్ స్టార్ అంటే పిచ్చి. కానీ, ఆయనతో నటించలేను. పవన్‌ను దూరంనుంచి చూస్తూ అభిమానిస్తూనే ఉంటా. అంత పెద్ద స్టార్‌ అయినా కూడా పవన్ అంత సింపుల్‌గా ఎలా ఉంటారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఆయనను అభిమానించడం తప్పా.. ఈ జీవితానికి మరొకటి అవసరం లేదు. ఆ అభిమానంతోనే 'తమ్ముడు' సినిమా 20 సార్లు చూశా. 'ఖుషీ' సినిమాలో ప్రతీ డైలాగ్ బాగా గుర్తుంది' అంటూ చెప్పుకొచ్చింది.

Read more:

ఆ టాటూ సీక్రెట్ చెప్పేసిన రష్మిక.. వారికోసమేనట!

కొండగట్టుకు జనసేనాని.. వారాహికి ప్రత్యేక పూజలు

First glimpse of Pawan Kalyan at Unstoppable with NBK S2: పవర్ స్ట్రోమ్ లోడింగ్!

Advertisement

Next Story