ప్రభాస్ ఊచకోత.. ‘సలార్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-12-23 05:25:18.0  )
ప్రభాస్ ఊచకోత.. ‘సలార్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘సలార్’. ఇందులో హీరోయిన్‌గా శృతి హాసన్ నటించగా.. జగపతిబాబు, పృథ్వీ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం డిసెంబర్ 22న గ్రాండ్‌గా థియేటర్స్‌లోకి వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదల సలార్ మూవీ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసును బద్దలు కొడుతోంది.

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్లు గతంలో ఉన్నడే లేని విధంగా రాబట్టి రికార్డ్ సృష్టించింది. శుక్రవారం ఒక్కరోజే సలార్‌కు రూ. 175 కోట్లకు పైగా వచ్చినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా రూ. 135 కోట్లు వసూళ్లు అయ్యాయి. వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రభాస్ ఖాతాలో భారీ వసూళ్లను సాధించిన సినిమా ఇదే అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాదిలో మొదటిరోజు బిగ్గెస్ట్ ఓపెసింగ్స్ ఇచ్చిన చిత్రంగా సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది. తర్వాతి స్థానాల్లో లియో, ఆదిపురుష్ సినిమాలు రూ. 140 కోట్ల గ్రాస్‌తో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్నాయని సమాచారం.

Read More : సలార్ సెంకడ్ పార్ట్ టైటిల్ రివీల్

Advertisement

Next Story